మహిళపై సామూహిక అత్యాచారం

Girl raped
Mass rape on a woman

Guntur: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరి మండలంలోని చినకాకానిలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళను వివస్త్రను చేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. కామాంధుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధిత మహిళ నగ్నంగానే సుమారు రెండు వందల మీటర్ల దూరం పరిగెత్తినట్టు సమాచారం. మహిళను వెంటాడి మరి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన నాయకుడు ఉన్నారని, అందుకే, ఈ కేసును గోప్యంగా పోలీసులు విచారణ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/