హైకోర్టుకు హాజరైన ఏపి డీజీపీ

అమరావతి: ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ బుధవారం తమ ముందు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించింది. అక్రమ మద్యం తరలింపు వ్యవహారంలో పట్టుబడిన వాహనాల అప్పగింతలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారన్న పిటిషన్‌పై నిన్న (మంగళవారం) విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారం నాటికి వాయిదా వేసింది. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ తమ ముందు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన ఇవాళ హైకోర్టు ముందు హాజరయ్యారు. కాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ న్యాయస్థానం ముందు హాజరు కావడం ఇదో మూడోసారి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/