నిమ్మగడ్డ రమేశ్ కు న్యాయం జరిగింది

హైకోర్టు తీర్పు నియంతపాలనకి చెంపపెట్టు

buddha venkanna
buddha venkanna

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్‌ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టిటిడిపి నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ.. హైకోర్టు తీర్పు నియంతపాలనకి చెంపపెట్టు. కరోనా నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోరి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కి న్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచనా ధోరణిలో మార్పువస్తుంది అని ఆశిస్తున్నా’ అని అన్నారు. ‘మీకు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేస్తారని, అరాచకం సృష్టిస్తారని కాదు. మేమింతే అంటే మరోసారి జగన్‌ గారు, విజయసాయిరెడ్డి గారు జైలుకి వెళ్లడం ఖాయం’ అని బుద్ధా వెంకన్న అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/