హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది

హైకోర్టు తీర్పుపై పవన్‌ కల్యాణ్‌

pawan kalyan
pawan kalyan

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి ఏపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఏపి హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది’ అని ఆయన పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/