ప్రధాని మోడితో అమిత్‌ షా భేటి

లాక్‌డౌన్ నాలుగో దశ‌ అనంతరం పై చర్చ

bjp meeting
Modi, AmithShah

న్యూఢిల్లీ: ఈ నెల 31న లాక్‌డౌన్ నాలుగో దశ ముగియనుంది. ఈనేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రధాని మోడితో భేటి అయ్యారు. న్యూఢిల్లీలోని 7 కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. లాక్‌డౌన్ ఐదో దశ విధించాలా వద్దా అనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇద్దరు నేతలూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చైనాతో వివాదాలపై కూడా మోడి, షా చర్చించినట్లు సమాచారం.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/