బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర డివిజన్‌ కోఆర్డినేటర్లను ప్రకటించిన సీఎం కేసీఆర్‌

cm kcr

బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర డివిజన్‌ కోఆర్డినేటర్లను ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మధ్యనే మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా మానిక్‌ కదమ్‌ను నియమించిన కేసీఆర్‌.. తాజాగా ఆ రాష్ట్ర డివిజన్‌ కోఆర్డినేటర్లను నియమించారు. నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మహారాష్ట్రలో తన రాజకీయ లక్ష్యాన్ని స్పష్టం చేసారు. ఆ రాష్ట్రం నుంచి పార్టీలో చేరిన నేతలకు ఇప్పుడు డివిజన్ల వారీగా బాధ్యతలను ఖరారు చేసారు. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నియామకం పైన కేసీఆర్ తాజాగా నిర్ణయం ప్రకటించారు.

నాసిక్‌ డివిజన్‌ కు దశరథ సావంత్ ‌, పుణె డివిజన్‌కు బాలసాహెబ్‌ జైరాం దేశ్‌ముఖ్, ముంబై డివిజన్‌కు విజయ్‌ తనాజి మోహితే ను నియమించారు. ఔరంగాబాద్‌ డివిజన్‌కుసోమ్‌నాథ్‌ థోరట్‌, నాగ్‌పూర్‌ డివిజన్‌కు ద్యానేష్‌ వాకుడ్‌కర్ ను నియమించిన కేసీఆర్ అమరావతి డివిజన్‌కునిఖిల్‌ దేశ్‌ముఖ్‌ను కోఆర్డినేటర్లుగా నియమించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఎవరితో కలిసి వెళ్తామన్నదానిఫై క్లారిటీ ఇవ్వని కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీ చేస్తామని మాత్రం క్లారిటీ ఇచ్చారు. అలాగే త్వరలోనే గ్రామ కమిటీలు కూడా నియమిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో మ‌హారాష్ట్ర అంతటా ప‌ర్య‌టిస్తాన‌ని కేసీఆర్ తెలుపడం జరిగింది.