కమల్ హాసన్ కు పెద్ద షాక్ ఇచ్చిన స్టాలిన్ స‌ర్కార్

కమల్ హాసన్ కు పెద్ద షాక్ ఇచ్చిన స్టాలిన్ స‌ర్కార్

రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడిన కమల్ హాసన్ కు స్టాలిన్ స‌ర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కమల్ ..తమిళ్ బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కారణంగా రెండు వారాలపాటు బిగ్ బాస్ షో కు దూరమయ్యారు. కరోనా కోలుకున్న వెంటనే షో కు హాజరవ్వడం పట్ల ఆగ్రహం వ్య‌క్తం చేసింది స్టాలిన్ స‌ర్కార్‌.

జాతీయ విప‌త్తుల చ‌ట్టం ప్ర‌కారం… క‌మ‌ల్ హాస‌న్ కు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. క‌మ‌ల్ హాస‌న్ న‌వంబ‌ర్ 22 వ తేదీన క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. దీంతో క‌మ‌ల్ హాస‌న్ ను చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ లో క‌రోనా చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు ఆయ‌ను కుటుంబ స‌భ్యులు. దాదాపు 10 రోజుల పాటు చికిత్స పొందిన క‌మ‌ల్ హాస‌న్ …. రెండు రోజుల క్రితమే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెంటనే షో కు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు జారీచేశారు.