భార‌తీయ భాష‌ల‌కు అధిక ప్రాధాన్యం..ప్ర‌ధాని

PM Modi addresses webinar on implementation of Budget in education sector

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ ఈరోజు విద్యా రంగానికి కేటాయించిన బ‌డ్జెట్‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ .. కొత్త జాతీయ విద్యా విధానంలో భార‌తీయ భాష‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు తెలిపారు. కొత్త విద్యావిధానంలో భార‌తీయ భాష‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు చెప్పారు. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఉత్త‌మ కాంటెంట్‌ను స్థానిక భాష‌ల్లోకి తీసుకురావాల్సిన బాధ్య‌త భాషా నిపుణుల‌పై ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ఈ ఏడాది త‌మ బడ్జెట్‌లో ఆరోగ్యం త‌ర్వాత అధిక ప్రాధాన్య‌త ఇచ్చిన వాటిలో విద్యారంగం ఉన్న‌ట్లు తెలిపారు. నైపుణ్యం, ప‌రిశోధ‌న‌, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కూడా అధిక ప్రాముఖ్య‌త ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్ నిర్మాణం కోసం యువ‌త‌లో ఆత్మ విశ్వాసం ఉండాల‌ని, త‌మ విద్య, నైపుణం, జ్ఞానంపై న‌మ్మ‌కం ఉన్న‌వారిలోనే ఆత్మ‌విశ్వాసం ఉంటుంద‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు. దేశంలో ఉన్న ప్ర‌తిభావంతుల‌ను వాడుకోవాల‌ని, భాషా అభ్యంత‌రాల‌ను, అవ‌రోధాల‌ను అధిగ‌మించాల‌న్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/