ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు ఢిల్లీ లో కవిత ఆధ్వర్యంలో ఇతర రాజకీయ పార్టీలు, పౌర సామాజిక సంస్థలతో కలిసి రౌండ్‌ టేబుల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందులో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ తరుణంలో కవిత ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. మరోపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా రెండోసారి రేపు కవిత ఈడీ ముందు హాజరుకాబోతున్నారు.

మార్చి 11 న ఈడీ ముందు కవిత హాజరైన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు కవిత ను విచారించడం ప్రారంభించిన అధికారులు..దాదాపు 09 గంటల పాటు విచారణ జరిపి..మార్చి 16 న మరోసారి హాజరుకావాలని ఆదేశించారు. కవిత ఈడీ ఎదుట హాజరై టైములో బిఆర్ఎస్ ప్రముఖ నేతలంతా ఢిల్లీకి వెళ్లడం జరిగింది. కవిత విచారణ పూర్తి అయ్యేవరకు కూడా అందర్నీ టెన్షన్ నెలకొని ఉంది. విచారణ అనంతరం కవిత ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం తో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనగా ఉండే.. కానీ కవిత నవ్వుతు బయటకు రావడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక రేపు ఏంజరుగుతుందో చూడాలి.