మన్నెగూడలో యువతి కిడ్నాప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్

మన్నెగూడలో యువతి కిడ్నాప్ ఘటన ఫై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. నిందితుడు నవీన్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలని కోరారు. రాగన్నగూడకు చెందిన వైశాలి ని గత కొద్దీ రోజులుగా నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో వైశాలి ఇంట్లో పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం వైశాలి కి పెండ్లి చూపులు ఏర్పాటు చేయగా..ఇది తెలుసుకున్న నవీన్‌ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి సదరు యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం యువతిని బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు వైశాలి జాడ తెలుసుకొని , తల్లిదండ్రులకు అప్పగించారు.

యువతి కిడ్నాప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసులు గూండాల నుంచి యువతికి ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు భద్రత కల్పించాలని గవర్నర్ ఆదేశించారు. మరోపక్క పోలీసులు నవీన్ రెడ్డి అండ్ గ్యాంగ్ పై ఐపీసీ సెక్షన్ 147,148,307,324,363,427,506,452,380r/w 149 కింద కేసు ఫైల్ చేశారు.