శ్రీముఖి వేసుకున్న డ్రెస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్..

టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత..శ్రీముఖి వేసుకున్న డ్రెస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఫలితంగా టాలీవుడ్‌లో యమా పాపులర్ అయిపోయింది. ‘అదుర్స్’ షోతో హోస్టుగా మారిన ఆమె.. ఆ తర్వాత ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలు చేసింది. దీంతో తెలుగులో టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది. ఓ వైపు యాంకర్ గా రాణిస్తూనే..మరోపక్క ఇంకొకవైపు గ్లామర్ షో తో యువతను పిచ్చెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్..హాట్ ఫోటో షూట్స్ , వీడియోస్ తో రచ్చ చేస్తుంటుంది.

తాజాగా ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న డాన్స్ షో కు యాంకర్ గా చేస్తుంది. దీనికి సీనియర్ హీరోయిన్ రాధ, ప్రముఖ హీరోయిన్ సదా , తరుణ్ మాస్టర్లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. గత వారమే గ్రాండ్ గా లాంచ్ చేశారు. బిగ్ బాస్ జోడి షోలో భాగంగా వచ్చేవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. అందులో యాంకర్ శ్రీముఖి బుల్లి నిక్కరు మాత్రమే ధరించి కనిపించింది. దీంతో ఆమె వేసుకున్న ఈ డ్రెస్ ఒక రేంజ్ లో హైలైట్ అవుతుంది. కాగా శ్రీముఖి వేసుకున్న డ్రెస్ ఫై హీరోయిన్ మాధవి లత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.

శ్రీముఖి బాడీకి.. ఆమె వేసుకున్న అడ్రస్ సెట్ కాలేదు అంటూ కామెంట్లు చేసింది. అలాగే కొన్ని విలువైన సలహాలు కూడా ఇవ్వడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ” శ్రీ .. నువ్వు మోడ్రన్ .. అలా మోడ్రన్ డ్రెస్సులు వేసుకో.. కానీ అవి నీ బాడీకి సెట్ అయ్యేలా చూసుకో.. కళ్ళకు నచ్చితే కాదు.. బాడీ కి నప్పాలి అప్పుడు చూడ్డానికి బాగుంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ కామెంట్స్ ఫై శ్రీముఖి స్పందిస్తుందా..లేదా అనేది చూడాలి.