బిఆర్‌ఎస్‌ అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందిః మంత్రి కెటిఆర్‌

రైతు రుణమాఫీ నిర్ణయం.. సిఎం కెసిఆర్‌ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం.. కెటిఆర్‌

minister-ktr

హైదరాబాద్‌ః కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బిజెపి సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా, రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని వెల్లడించారు. బిఆర్‌ఎస్‌ అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు.

రైతు సంక్షేమంలో తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకమన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం.. కానీ, ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషమని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిదని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు.