పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

నార్కట్ పల్లి వద్ద బస్సుకు యాక్సిడెంట్

bus-with-pushpa-2-artists-met-with-road-accident

హైదరాబాద్‌ః అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప-2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆర్టిస్టులు వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురయింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలో నార్కట్ పల్లి వద్ద ఆర్టిస్టులు వస్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. షూటింగ్ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది.

కాగా, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ ముగించుకుని పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోకి రాగానే.. అదుపు తప్పిన ప్రైవేటు బస్సు ఆగివున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సులో ఉన్న పలువురు ఆర్టిస్టులు స్వల్పంగా గాయపడ్డారు.

సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రెండేండ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందాడు. రష్మిక మంధన్నా కూడా నేషనల్‌ క్రష్‌గా మారింది.