కరోనాపై నెగిటివ్‌ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది

తెలంగాణ నివసిస్తున్నవారికి కరోనా సోకలేదు

etela rajender
etela rajender

హైదరాబాద్‌: కరోనా వైరస్‌పై నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో వసతులు సరిగా లేవని జూనియర్ డాక్టర్లు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోందన్నారు. వైద్య సిబ్బందికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్లే మాస్క్‌లు వేసుకుని తిరుగుతే జనాల్లో ఇంకా భయం పెరుగుతుందన్నారు. తెలంగాణలో నివసిస్తున్నవారికి కరోనా సోకలేదని అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే వైరస్‌ వచ్చిందన్నారు. ప్రజలకు పారామెడికల్ సిబ్బంది అవగాహన కల్పించాలని ఈటల రాజేందర్ సూచించారు.

తాజా బిజెనెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/