‘బీఆర్ఎస్’ జెండాలో ఆ రెండు లేవు..గమనించారా ..?

టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయ్యింది. ఎన్నికల సంఘం బీఆర్ఎస్ కు ఆమోదం తెలుపడం తో శుక్రవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్.. నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ ను గుర్తిస్తూ ఈసీ పంపిన లేఖపై రిప్లైగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు సంతకం చేశారు.

అనంతరం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. అయితే.. బీఆర్ఎస్ జెండా కూడా అచ్చం టీఆర్ఎస్ జెండానే పోలి ఉంది అయితే.. అందులో కొన్ని మార్పులు చేశారు. అదే రంగుతో ఉన్న జెండాపై.. తెలంగాణ మ్యాప్ దగ్గర భారత్ దేశ పటాన్ని చేర్చారు. అయితే.. ఇంతకు ముందు ఉన్న కండువాలపై తెలంగాణ తల్లి బొమ్మ ఉండేది.. కానీ.. ఇప్పుడు వేసుకున్న కండువాలపై ఎలాంటి బొమ్మ లేకపోవటం గమనార్హం.

బిఆర్ఎస్ గా ఆవిర్భవించిన సందర్బంగా సీఎం కేసీఆర్‌కు జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయ‌కులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. . ‘తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకొన్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం’ అని సీఎం కేసీఆర్‌ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి’ అని నాడు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. పేరు మార్పును ఆమోదిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు గురువారం లేఖ రాసింది. దీంతో టీఆర్‌ఎస్‌ నేటి నుంచి బీఆర్‌ఎస్‌గా అవతరించింది.