పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..మరోసారి అలరించబోతున్న తొలిప్రేమ

పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలిప్రేమ ఓ మైలురాయి చిత్రం. 1998లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ మూవీ లో పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో..ఈ సినిమాను చూసి చిత్రసీమలో అడుగుపెట్టిన వారు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌, పవన్‌-కీర్తికు మధ్య వచ్చే సీన్స్‌, ప్రేక్షకులను ఎమోషనల్ చేసిన క్లైమాక్స్‌, విజిల్స్‌ వేయించిన పాటలు, సిస్టర్‌ సెంటిమెంట్‌ ఇలా సినిమాలో ప్రతీది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి ఈ గొప్ప ప్రేమ కావ్యం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది.

ఈ సినిమా వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా మేకర్స్‌ రీ-రిలీజ్‌ను సిద్ధం చేస్తున్నారు. జూన్‌ 30న ఈ సినిమా 4K ప్రింట్‌తో రీ-రిలీజ్‌ కానుంది. దీనికి సంబదించిన ఏర్పాట్లను మేకర్స్ చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలు , మరోపక్క సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. జులై నెలలో బ్రో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండడం విశేషం.