యూట్యూబ్ లో రికార్డ్స్ వ్యూస్ తో దూసుకెళ్తున్న ‘BRO’ టీజర్

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న BRO టీజర్ రావడమే కాదు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇది వినోదయ సితం రీమేక్. ఒరిజినల్ లో సముద్రఖని, తంబి రామయ్య నటించారు. అదే పాత్రలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ చేస్తున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్.

మనిషిలోని భయాలను, బాధలను కామిక్ గా చెప్పే ప్రయత్నం. అదే సమయంలో జీవితం అంటే ఏమిటో చెప్పే సినిమా. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు చేశారు డైరెక్టర్ సముద్రఖని. జులై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను గురువారం విడుదల చేసి అంచనాలు రెట్టింపు చేసారు.

టీజర్లో పవన్ సాయి ధరమ్ తేజ్ ని ఓ ఆటాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ కాంఫిడెన్స్, సాయి ధరమ్ తేజ్ కంగారు టీజర్ కి హైలెట్. భయపెట్టకు చిన్న పిల్లాడ్ని’ బ్రో అని సాయి ధరమ్ చెప్పగా, పవన్ కళ్యాణ్ సెటైరికల్ గా ఓ నిట్టూర్పు ఇస్తాడు. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న సాయి ధరమ్ తేజ్ తో పవన్ ‘సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వూ’ అని చెప్పడం బాగుంది. సాయి తేజ్ భయాలతో ఆదుకున్న పవన్ కళ్యాణ్ అల్లరి అలరించింది. ఓవరాల్ గా టీజర్ అభిమానులను , ప్రేక్షకులను అలరించింది. మరి సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి.

YouTube video