టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వార్తలను ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అధికార పార్టీ టిఆర్ఎస్ నేతలను కొనుగోలు చేసేందుకు బిజెపి ట్రై చేసిందనే వార్తలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రూ.100 కోట్లు రూపాయిలు తమ దగ్గర ఎక్కడి అని , అయినా, వాళ్లు 100 కోట్ల రూపాయల ఖరీదైన వ్యక్తులా అని ఆయన ప్రశ్నించారు. నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే లతో పీఠాధిపతి రామచంద్రభారతి, బీజేపీ నేత నందకుమార్, సింహయాజులు బేరసారాలు ఆడుతుండగా..పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. తమకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే లే సమాచారం ఇచ్చారని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై టిఆర్ఎస్ నేతలు…కేంద్రం ఫై నిప్పులు చెరుగుతున్నారు.

అయితే ఈ వ్యవహారం ఫై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనే వార్తలను ఖండిస్తున్నా.. అలాంటి అవసరం తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఇదంతా ఒక నాటకాన్ని తలిపిస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రూ. ౧౦౦ కోట్ల రూపాయల డబ్బు మా దగ్గర ఎక్కడిదని .. అయినా, వాళ్లు 100 కోట్ల రూపాయల ఖరీదైన వ్యక్తులా అని ఆయన ప్రశ్నించారు.

కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నందకుమార్ అనే వ్యాపారి.. బీజేపీ తరఫున టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించారని వార్తలు ప్రచారం అవుతుండగా.. ఆ వార్తలను కిషన్ రెడ్డి ఖండించారు. ఆ నందకుమార్ ఎవరో తనకు తెలియదని, ఆ పేరు ఇప్పుడే వింటున్నానని కిషన్ రెడ్డి అన్నారు. ఘటనపై సీబీఐతో మాత్రమే కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించేందుకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.