బ్రేక్‌ఫాస్ట్‌లో దోశలు

రుచి: వెరైటీ వంటకాలు

చీజ్‌ దోశ

Cheese dosa

కావలసినవి :
మినప్పప్పు, బియ్య: రెండు కప్పులు, అన్న లేదా అటుకులు : కొద్దిగా, మెంతులు: టీస్పూను,
సెనగపప్పు: 2 టేబుల్‌ స్పూన్లు, చీజ్‌: 100గ్రా,

క్యారెట్‌ తురుము: అరకప్పు, పచ్చిమిర్చి తురుము : పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె లేదా నెయ్యి : సరిపడా

తయారుచేసే విధానం :

ముందురోజే మినప్పప్పు బియ్యం, మెంతులు, సెనగపప్పుఎనిమిది గంటలు నానబెట్టుకుని రుబ్బుకుని ఉంచాలి. రుబ్బేటప్పుడు కాస్త అన్నం లేదా నానేసిన అటుకులు కూడా వేయాలి.

ఉప్పు కలిపి పిండిని పులియనివ్వాలి. మర్నాడు మామూలుగానే పెనం మీద దోవ వేసుకుని నూనె లేదా నెయ్యి వేస్తూ కాలనివ్వాలి.

కాస్త కాలిన తరవాత చీజ్‌తురుము, క్యారెట్‌తురుము, పచ్చిమిర్చితురము పైన చల్లి ఏదైనా చట్నీతో వేడివేడిగా వడ్డించాలి.

తీపి దోశ

Sweet Dosa

కావల్సినవి :
గోధుమపిండి- కప్పు, బియ్యపిండి – అరకప్పు కొబ్బరి తురుము – రెండు టేబుల్‌స్పూన్లు.

శొంఠిపొడి – చిటి కడు, బెల్లం తరుగు – కప్పు, యాలకుల పొడి – అరచెంచా, నెయ్యి- అరకప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు – కొన్ని, ఉప్పు- చిటికెడు

తయారీ విధానం :

ఓ గిన్నెలో గోధుమపిండి, బియ్య పిండి, కొబ్బరితురుమూ, యాలకుల పొడి, శొంఠిపొడి, ఉప్పు వేసుకుని బాగా కలపాలి. బెల్లం తరుగును మరో గిన్నెలోని తీసుకుని రెండుకప్పుల నీళ్లుపోసి పొయ్యిమీద పెట్టాలి.

అది కరిగి లేత పాకం అవు తున్నప్పుడు దింపేయాలి. ఈ పాకాన్ని ఒకసారి వడకట్టి గోధుమపిండి మిశ్రమం లో వేసుకుంటూ దోశపిండిలా కలపాలి.

ఇది మరీ పల్చగా, అలాగని గట్టిగా లేకుండా చూసుకోవాలి. పెనాన్ని పొయ్యి మీద పెట్టి చెంచా నెయ్యి కరిగించి జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకుల్ని వేయించుకుని ఈ పిండిలో కలపాలి.

ఇప్పుడు ఈ పిండిని పెనంమీద దోశలా పరిచి, నెయ్యి వేసుకుంటూ రెండువైపులా కాల్చి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పండినీ చేసుకుంటే చాలు.

Raagi Dosa

రాగి దోశ

వేసవిలో రాగి ఎక్కువగా తీసుకోవాలంటారు. షుగర్‌ ఉన్నవాళ్లు కూడా తీసుకుంటారు. అలాగని జావే తాగాల్సిన అవసరంలేదు. ఇలా దోశ కూడా వేసుకోవచ్చు.

కావల్సినవి :
రాగి పిండి- కప్పు, బొంబాయిరవ్వ- కప్పు, బియ్యపిండి – అరకప్పు, అల్లం ముక్క – చిన్నది (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి తరుగు – చెంచా, కరివేపాకు రెబ్బ- ఒకటి, సన్నగా తురిమిన కొత్తిమీర – రెండు చెంచాలి.

ఉల్లిపాయ – ఒకటి, జీలకర్ర – చెంచా, మిరియాల పొడి – అర చెంచా, ఉప్పు- తగినంత, నీళ్లు – సిపడా, నూనె – అరకప్పు, పెరుగు – అరకప్పు.

తయారు చేయువిధానం :

మొదట ఒక గిన్నెలో రాగిపిండి, బొంబాయిరవ్వ, బియ్యపిండి తీసుకోవాలి. ఇందులో నూనె, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి.

ఇప్పుడు సరిపడా నీల్లు కలిపి పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని కనీసం ఇరవై నిమిషలు నాననివ్వాలి. తరువాత అవసరం ఆనుకుంటే మరికాసిని నీళ్లు కలపాలి.

పొయ్యిమీద పెనం పెట్టి.. ఈ పిడిని దోశలా పరిచి, చుట్టూ నూనె వేయాలి. ఎర్రగా కాలాక తీసుకుంటే చాలు. ఇలాగే మిగిలిన పిండి కూడా చేసుకోవా లి.వేడి వేడిగా పుదీనా చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటాయి.

సగ్గు బియ్యం దోశ

Saggu biyyam dosa

కావల్సినవి :
సగ్గుబియ్యం : కప్పు (కప్పు నీటిలో రెండు గంటలముందు నానబెట్టుకోవాలి .

సెనగపిండి- అరకప్పు, బియ్యపిండి-అరకప్పు, ఉప్పు-తగినంత, సన్నగా తరిగిన అల్లం ముక్కులు – కొన్ని..

ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, పచ్చిమిర్చి-మూడు, జీలకర్రI చెంచా, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నూనె- అరకప్పు

తయారు చేయు విదానం :

సగ్గుబియ్యంలోని నీల్లు వంపేయకుండానే సెనగపిడి, బియ్యపిండి, ఉప్పువేసి బాగా కలపాలి.

పెనంపై మరీ పలుచగా కాకుండా కాస్త మందంగానే దోశవేసి పైన ఉల్లిపాయ, అ్లంముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కత్తిమీర చల్లాలి.

చుట్టూనూనె వేసి మూత పెట్టేయాలి. ఐదు నిమిషాలకు ఇది కాలుతుంది. ఈ దోశ మెత్తగానే ఉంటుంది. దీన్ని కొబ్బరి చట్నీతో కలిపి తీసుకోవచ్చు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/