మౌత్‌వాష్‌ సహజంగా

Mouth Wash Naturally

నోటి నుంచి దుర్వాసనా, చిగుళ్ల సమస్యలున్నప్పుడు వైద్యులు మౌత్‌వాష్‌ వాడాలని సూచిస్తుంటారు. వాటిని ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. ఉప్పు నీళ్లు నోటిని ఆరోగ్యంగా ఉంచే సహజసిద్ధ మౌత్‌వాష్‌. కప్పు గోరువెచ్చని నీళ్లలో పెద్ద చెంచా ఉప్పు కలపాలి. రోజుకు మూడుసార్లు ఈ నోటితో పుక్కిలిస్తే చిగుళ్లకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.

ముఖ్యంగా భోజనం చేసిన తరువాత ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కప్పు ఉప్పు నీళ్లలో రెండు చెంచాల వెనిగర్‌ కలపాలి. ఈ నీటిని ఓ సీసాలోకి తీసుకోవాలి. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే వారం పాటు నిలువ ఉంటుంది. చిన్న మూతలో ఈ నీటిని తీసుకుని అవసరమైనప్పుడు పుక్కిలించి ఉమ్మేస్తే సరిపోతుంది. కుదిరితే యాపిల్‌సిడార్‌ వెనిగర్‌ వాడితే మంచిది. ఒక కప్పు చల్లటి నీళ్లలో పది చుక్కల లవంగనూనె, లేదంటే చెంచా దాల్చిన చెక్క పొడి కలపాలి.

ఇది మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. లవంగం, దాల్చిన చెక్కలో ఉండే బాక్టీరియాను చంపి నోటి దుర్వాసన తగ్గిస్తాయి. ఒక కప్పు నీళ్లలో రెండు చెంచాల వంటసోడా, గుప్పెడు పుదీనా ఆకులు వేయాలి. అందుబాటులో ఉంటే రెండు చుక్కల టీట్రీనూనె కలుపుకుంటే మంచిది. ఈ మిశ్రమాన్ని ఓ సీసాలో భద్రపరచుకుంటే సరిపోతుంది. దీన్ని వాడాలనుకున్నప్పుడు సీసాను ఒకటికి రెండుసార్లు కుదుపడం తప్పనిసరి. లేదంటే వంటసోడా అడుగునే ఉండిపోతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/