పోటీ ప్రపంచంలో నిద్ర కరువు

ఆరోగ్య సంరక్షణ

Sleep deprivation

మన శరీర నిర్మాణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రిపోవడం ఎంతో అవసరం. ఎన్ని కోట్లున్న నిద్ర కరువయితే జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిద్ర కరువై చాలా మంది సతమవుతున్నారు.

కాగా ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల నుంచి 9 గంటల సంతృప్తి కరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అని డాక్టర్స్‌ తెలిపారు.

Sleep deprivation in a competitive world-

ఆమె నిద్ర అవసరాన్ని వివరించారు. మనం నాణ్యమైన నిద్ర పోగలితే హార్మోన్లు, గుండె మెదడు తదితర అవయవాలలో రోగిరోధక శక్తి పెరిగి మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటామని డాక్టర్లు చెబుతున్నారు.

కాగా ఏకారణంతోనైన సరియైన నిద్ర పోనప్పుడు విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం తదితర చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది.

Sleep deprivation

నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులో కీలకంగా ఉన్న ‘అమిగ్‌డాలా అనే రసాయన పనితనం మందగిస్తుదని ఇటీవల జర్నల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ తెలిపింది.

కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిరూపించింది. నిద్ర సమస్యలను అధిగమిచాలంటే పౌష కాహారం, వ్యాయాయం, మానసిక ప్రశాంతత మూడు కచ్చతంగా పాటంచాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/