మరొకసారి తాత అయినా బ్రహ్మానందం ..

బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ సతీమణి జోత్స్న పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. అమ్మాయి పుట్టడంతో తమ ఆనందం మరింత రెట్టింపు అయిందని తెలియజేశారు. ప్రస్తుతం గౌతమ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయంపై మంచు లక్ష్మి, బిందు మాధవి తదితర సెలబ్రిటీలు సైతం బ్రహ్మానందం గౌతమ్ దంపతులను అభినందిస్తూ ఉన్నారు.

బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు కాగా గౌతమ్ హీరోగా కొన్ని చిత్రాలలో నటించారు. మొదట 2004లో పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ఉన్నత విద్యను అభ్యసించి తిరిగి వచ్చిన గౌతమ్ మళ్లీ సినిమాలలో నటించినప్పటికీ , పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇక బ్రహ్మానందం విషయానికి వస్తే..టాలీవుడ్ లో హాస్యనటుడిగా లెజెండరీ కమెడియన్ గా పేరుపొందిన బ్రహ్మానందం ముఖ ఛాయలోనే ఎంతో కామెడీ చేయగలరు. ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గిన అప్పుడప్పుడు పలు సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు.