ఏపి వికేంద్రీకరణపై సుప్రీంలో విచారణ వాయిదా

హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోను ఎత్తివేయాలన్న ఏపి ప్రభుత్వం

supreme court
supreme court

న్యూఢిల్లీ: ఏపిలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈచట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తాము ఇచ్చిన జీవోలు రాజ్యాంగపరమైనవా? లేదా? అనే అంశాలను పరిశీలించకుండా ఏపి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఈ రోజు ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్‌తో కూడిన ధర్మాసనం విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/