టిఆర్ఎస్, బిజెపిలు రెండూ ఒక్కటేః కేఏ పాల్

ఉపఎన్నికలో నేను ఓడిపోవడానికి ఎలక్షన్ ఆఫీసర్లే కారణం

KA Paul

హైదరాబాద్‌ః ఉపఎన్నికలో తాను ఓడిపోవడానికి ఎలక్షన్ ఆఫీసర్లే కారణమని కేఏ పాల్ ఫైర్ అయ్యారు.మునుగోడు ఉపఎన్నికలో ఎలక్షన్ ఆఫీసర్లు టిఆర్ఎస్ ఏజెంట్లుగా పనిచేశారని కేఏ పాల్ ఆరోపించారు. ప్రచార సమయంలో టిఆర్ఎస్ నాయకులు తనను అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. ఈవీఎంలను మార్చడం వల్లనే తాను ఓడిపోయానని అన్నారు. ఓడిపోయినా మునుగోడులోనే ఉంటానని పాల్ చెప్పారు.

టిఆర్ఎస్, బిజెపిలు రెండూ ఒక్కటేనని కేఏ పాల్ విమర్శించారు. కెసిఆర్.. బిజెపికి బీ పార్టీగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మోడీ డైరెక్షన్‭లో బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి కాంగ్రెస్‭ను దేశంలో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కెసిఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ విషయం పై తాను కెసిఆర్‭ని ఎందుకు ప్రశ్నించడం లేదని.. సీబీఐ డైరెక్టర్, అమిత్ షాని ప్రశ్నించానని చెప్పారు. వాళ్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కేఏ పాల్ మండిపడ్డారు. దేశంలో బిజెపి తప్ప ఇంకో పార్టీ ఉండకూడదని మోడీ కుట్ర చేస్తున్నారన్నారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బిజెపి పడగొట్టిందని పేర్కొన్నారు. బిజెపి కంటే బలమైన శివసేన పార్టీని కూడా మహారాష్ట్రలో చిత్తుగా ఓడించారని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/