సరికొత్త గెటప్ లో కళ్యాణ్ రామ్

బింబిసారా మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్..ఇప్పుడు మరో సరికొత్త అంశంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తన 19వ చిత్రం చేయబోతున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ను తెలిపింది చిత్ర యూనిట్. ఈ సినిమా టైటిల్‌ ను అనౌన్స్‌ చేశారు. Amigos అనే డిఫరెంట్‌ టైటిల్‌ తో కళ్యాణ్‌ రామ్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాను Feb 10, 2023 న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరికొత్త గెటప్ తో రాబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

బింబిసార సినిమా విషయానికి వస్తే.. విశిష్ఠ్ దర్శకత్వంలో ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటు ప్రేక్షకులతో పాటు అటు బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత క‌థ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ బింబిసార చ‌క్ర‌వ‌ర్తిగా, దేవ‌ద‌త్తుడిగా ద్విపాత్రాభిన‌యం చేసి అలరించారు.