రణ్ బీర్ దంపతులకు విషెష్ తెలిపిన మహేష్ బాబు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఆదివారం పండింటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ గుడ్ న్యూస్‌తో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషంగా ఉన్నారు. నెటిజన్స్ , సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రణ్ భీర్, ఆలియా దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ కంగ్రాట్స్ తెలుపగా , తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆలియా, రణ్ బీర్ లకు విషెస్ చెప్పారు. ఆలియా షేర్ చేసిన ఫొటోను చూపిస్తూ.. “కూతుర్లు చాలా ప్రత్యేకం” అంటూ ఆడపిల్లలపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.

రణబీర్ , అలియా వీరిద్దరూ ప్రేమించి, ఇరు కుటుంబాలను ఒప్పించి ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు. ఆదివారం ఆలియా భట్ గిర్‌గాన్‌ లోని అంబానీకి చెందిన రిలయన్స్ హాస్పిటల్‌ లో పాపకు జన్మనిచ్చింది.. మహేశ్ బాబు సినిమాల విషయాలకొస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో #SSMB 28 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. థమన్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.