కర్ణాటక ఎన్నికల ఫలితాలు..ఆలయంలో ప్రియాంకాగాంధీ పూజలు

శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రియాంక పూజలు చేశారన్న కాంగ్రెస్

Priyanka Gandhi offers prayers at Jakhu Hanuman Temple in Shimla

సిమ్లాః కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఓ ఆలయంలో పూజలు చేశారు. ఆమె ప్రార్థనలు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తూ… దేశ, కర్ణాటక రాష్ట్ర శాంతి, సౌభ్రాతృత్వం కోసం హనుమాన్ ఆలయంలో ప్రియాంక ప్రార్థనలు నిర్వహించారని తెలిపారు. మరోవైపు కౌంటింగ్ ప్రారంభమైన గంట వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ సగానికి పైగా స్థానాల్లో ఆధిక్యతలోకి వెళ్లింది. 224 స్థానాలకు గాను ప్రస్తుతం 121 స్థానాల్లో లీడ్ లో ఉంది. మరోవైపు ఎన్నికల ట్రెండ్స్ ను రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.