బళ్లారిలో గాలికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వైపు దూసుకుపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదిలా ఉంటె ఏపీ సరిహద్దులకు ఆనుకుని ఉండే బళ్లారిలో గాలి బ్రదర్స్ భారీ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బళ్లారి సిటీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ఆధిక్యతలో కొనసాగుతోంది.

కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నారా భరత్ రెడ్డి పూర్తి ఆధిక్యతలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన కళ్యాన రాజ్య ప్రజాపక్ష అభ్యర్థి గాలి లక్ష్మీ అరుణ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. బీజేపీకి పడాల్సిన ఓట్లను గాలి లక్ష్మీ అరుణ రెడ్డి చీల్చడం వల్లే ఇక్కడ కాంగ్రెస్ గెలుపు దిశగా సాగుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇక కనకపుర నియోజక వర్గంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించారు. దీంతో ఇప్పటి వరకు నాలుగో సారి కనకపుర నియోజక వర్గంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించినట్లైయింది.