100 మంది ప్రయాణించే పడవ బోల్తా

100 మంది ప్రయాణించే పడవ   బోల్తా
Boat carrying over 100 people capsizes in Bihar

పాట్నా: బీహార్‌లోని భగల్‌పుర్‌ వద్ద గంగానదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 100 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 70 మంది గల్లంతయ్యారు. సామ‌ర్థ్యానికి మించి ప‌డ‌వ‌లో కూలీల‌ను, రైతుల‌ను ఎక్కించే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మంది మృత‌దేహాల‌ను వెలికితీశారు. మ‌రో 15 మంది దాకా ఈత కొడుతూ ఒడ్డుకు చేరారు. గ‌ల్లంతైన వారి కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. బాధిత కుటుంబాల స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/