దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు బోల్తా

Car Overturns On Durgam Cheruvu Cable Bridge

హైదరాబాద్‌: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం మ‌ధ్యాహ్నం ప్ర‌మాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవ‌డంతో.. అది ప‌ల్టీలు కొట్టింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు లాగారు. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. న‌డిరోడ్డుపై బోల్తా ప‌డ్డ కారును ట్రాఫిక్ పోలీసులు ప‌క్క‌కు నెట్టారు. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/