అక్కినేని కోడలా మజాకా.. బిగ్ బాస్ రేటింగ్స్‌తో దుమ్ములేపిన సమంత!

ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం నుండే పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు మొదలుకొని, బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ సీజన్ బిగ్‌బాస్ తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఈ షో 60 రోజులు పూర్తి చేసుకోవడంతో రోజురోజుకూ బిగ్‌బాస్ 4 మరింత ఉత్కంఠభరితంగా సాగుతూ వెళ్తోంది.

ఇక ఈ షోకు హోస్ట్‌గా ఉన్న అక్కినేని నాగార్జున తనదైన హోస్టింగ్‌తో ఈ షోకు మరింత క్రేజ్‌ను తీసుకొస్తున్నారు. కాగా ఇటీవల ఆయన నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ చిత్ర షూటింగ్ నిమిత్తం ఆయన కులూ మనాలీకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బిగ్‌బాస్ షోను ఎవరితో హోస్ట్ చేయించాలా అని నిర్వాహకులు సతమతమయ్యారు. దసరా రోజున టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కావడంతో స్టార్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంతతో బిగ్ బాస్ షోను హోస్ట్ చేయించారు నిర్వాహకులు. ఇక అందరూ అనుకున్నట్లుగానే సమంత హోస్టింగ్ అద్భుతంగా ఉండటంతో ఆ వారం బిగ్ బాస్ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చి పడింది.

దసరా రోజున సమంత హోస్ట్ చేసి బిగ్ బాస్ షోకు ఏకంగా 11.3 టీఆర్పీ రేటింగ్ రావడంతో షో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము అనుకున్న విధంగానే ఈ షోకు అత్యధ్భుత రెస్పాన్స్ దక్కిందని, నాగార్జునకు తగ్గ కోడలిగా సమంత నిలిచిందని బిగ్ బాస్ నిర్వాహకులు అంటున్నారు. మరి అక్కినేని కోడలా మజాకా అని సమంత ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.