‘పవర్ స్టార్’కు గుండెపోటు..ఆందోళన లో అభిమానులు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తుంది. సడెన్ గా ఆయనకు గుండెపోటు రావడం తో కుటుంబ సభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త తెలిసి అభిమానులు , చిత్రసీమ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ..ఆయన క్షేమం కోరుకుంటున్నారు.

నాలుగు గంటల క్రితమే పునీత్ రాజ్ కుమార్ బజరంగీ-2 సినిమా సూపర్ హిట్ అయినందుకు చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు తెలిపారు. పునీత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా విక్రమ్ ఆసుపత్రికి చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీనియర్ పోలీస్ అధికారులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ నివాసానికి సైతం భద్రత కల్పించారు.. పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కుమార్తె నివేదిత.. పునీత్ కుటుంబ సభ్యులు.. క్రేజీ స్టార్ రవిచంద్రన్, నిర్మాతలు జయన్న, కేపీ శ్రీకాంత్ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి చేరుకుని పునీత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

పునీత్ రాజ్ కుమార్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. అతిథి పాత్రల్లో మెరిసాడు. రాంగోపాల్ వర్మ తీసిన గంధుపు చెక్కల స్మగ్లర్ ‘వీరప్పన్’ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.