వరంగల్ లో ఈ నెల 27న బీజేపీ భారీ బహిరంగ సభ

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి పార్టీ ని అధికారంలోకి తీసుకరావాలని కేంద్ర బిజెపి పూర్తిగా ఫోకస్ చేసింది. దానికి తగ్గట్లే రాష్ట్రంలో బిజెపి పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్తూ…ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల నుండి కీలక నేతలు బిజెపి లోకి వెళ్లగా..మరికొంతమంది ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ నెల 27 న వరంగల్ లో భారీ బహిరంగ సభ చేప్పట్టబోతోంది.

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్ర ఈనెల 27వ తేదీతో ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ నగరంలో భారీ బహిరంగ సభకు బీజేపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ సభ కోసం ఆయా జిల్లాల బూత్ కమిటీల అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ సభకు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈరోజు నుండే జన సమీకరణపై దృష్టిపెట్టారు. వరంగల్ లో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరుకానున్నారు. దీంతో భారీ జన సమీకరణకు బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు.