ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం జగన్‌ భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..ప్రధాని మోడీ తో భేటీ ముగిసింది. ఆదివారం రాత్రి 9.40 గంటలకు ఢిల్లీకి చేరుకున్న ఆయన.. విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాస గృహం జన్‌పథ్‌ 1కు వెళ్లారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రధానితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు.

నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే, ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఆర్‌.కే. సింగ్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6వేల కోట్ల విద్యుత్‌ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతొ జగన్‌ భేటీ కానున్నారు.