ఈనెల 25న తెరవబడనున్న కేదార్‌నాథ్ ఆల‌యం

Kedarnath Dham to open its door for devotees on April 25

డెహ్రాడూన్‌: కేదార్‌నాథ్ ఆల‌యాన్ని ఈ నెల 25వ తేదీన తెర‌వ‌నున్నారు. ఛార్‌ధామ్ యాత్ర నిర్వ‌హ‌క అధికారులు ఈ విష‌యాన్ని తెలిపారు. హెలికాప్ట‌ర్ స‌ర్వీసులు కూడా ఆ రోజు నుంచే అందుబాటులో ఉంటాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. హెలికాప్ట‌ర్ ద్వారా కేదారీశ్వ‌రుడిని ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకునే భ‌క్తులు ఐఆర్సీటీసీ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఛార్‌ధామ్ యాత్ర‌కు సుమారు ఆరున్న‌ర ల‌క్ష‌ల మంది రిజిస్ట‌ర్ చేసుకున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ టూరిజం డెవ‌ల‌ప్మెంట్ కౌన్సిల్ తెలిపింది. దీంట్లో కేదార్‌నాథ్‌కు 2.41 ల‌క్ష‌ల మంది రిజిస్ట‌ర్ చేసుకున్నారు.