దక్షిణాదిన బలపడుతున్న బిజెపి!

ఎత్తుగడల రచన!

BJP strengthening in the South!
BJP strengthening in the South!

2024 లోక్‌ సభఎన్నికలు వచ్చేనాటికి బిజెపి దక్షిణాదిలో బలపడాలని ఎత్తుగడలు రచిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో అది అధికారంలో ఉంది. తెలంగాణలో గణనీయంగా బలపడుతుంది. కేరళలో శబరిమల అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుని లబ్ధిపొందే విషయంలో తెలివిగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో ఏడిఎమ్‌కె పొత్తు ఈ దిశలో మంచి అవకాశాన్ని ఇస్తున్నది.

భారతదేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తమిళనాడు అనేక విషయాల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆసక్తికరమైన రాజకీయాలు, కరుడుగట్టిన ద్రవిడవాదం ఇక్కడ కన్పిస్తాయి.

అటువంటి రాష్ట్రంలో ఆర్యుల రాజకీయ పార్టీగా పేరున్న బిజెపి తరపున హోంమంత్రి అమిత్‌ షా తమిళ రాజకీయ పొత్తుల చరిత్రను తిరగరాశాడని చెప్పడం అతిశ యోక్తి కాదు.

నవంబర్‌లో ఆయన చెన్న§్‌ు వచ్చి నెరిపిన రాజకీయం ఏడిఎమ్‌కె, బిజెపిల మధ్య పొత్తును కుదిర్చింది. దీంతో కాంగ్రెస్‌కి తప్పనిసరిగా డిఎమ్‌కెతో పొత్తు పెట్టుకోవ లసిన అగత్యం ఏర్పడింది. అందుకే అమిత్‌ షా చరిత్రను తిరగరాశాడన్నారు.

ఒక జాతీయ పార్టీ అయినా, కేంద్రంలో అధికారంలో పార్టీ అయినా బిజెపి ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తుకోసం స్వయంగా చెన్న§్‌ు వెళ్లడం కమల నాథుల రాజకీయ చాతుర్యంలో భాగంగానే భావించాలి.

ఉత్తర భారతంతో తమిళనాడును పోల్చవద్దు

తమిళనాడు ఒక విలక్షణమైన రాష్ట్రం. అణగారిన వర్గాలవారికి 69 శాతం రిజర్వేషన్లు అమలవ్ఞతున్న రాష్ట్రం. అగ్రకుల ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నదక్కడ.

ద్రవిడ జాతి భావన నరనరాన జీర్ణించుకున్నా ప్రస్తుతం ఆ భావజాలం కాస్త బలహీనపడిందనే చెప్పవచ్చు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌… ఆ మాటకొస్తే మొత్తం ఉత్తర భారత రాజ కీయాలకు భిన్నంగా కనిపించే రాష్ట్రం అది.అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, మాయావతి, ములాయం సింగ్‌ యాదవ్‌ వంటివారు ద్రవిడ రాజకీయనాయకులతో పోల్చిన ప్పుడు చాలా పెద్ద మనుషులని చెప్పాలి.

తమిళరాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఎక్కువగా కనపిస్తాయి. జయలలిత- కరుణా నిధిమధ్య కొనసాగిన వైరం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఈ వైర భావం కొంత తగ్గిందనే చెప్పాలి.

డీఎంకే, ఏడిఎమ్‌కె మధ్య యుద్ధం

తమిళనాడు అసెంబ్లీకి 2021 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 234 స్థానాలున్న శాసన సభకు ఈ సారి పాతతరం నాయకులు లేకుండా కొత్త తరం రాజకీయ నాయకులు సమర శంఖం పూరిస్తున్నారు.

మొదటిసారిగా తమ అధినాయకురాలు జయలలిత లేకుండా ఏడిఎమ్‌కె, కరుణానిధి లేకుండా డిఎమ్‌కెపార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎన్నికల రంగంలోకి దూకుతున్నారు. డిఎమ్‌కెని ఎమ్‌కె స్టాలిన్‌ నడిపిస్తుంటే ఏడిఎమ్‌కెని ఎడపాటి పళనిస్వామి నడిపిస్తున్నాడు.

కరుణానిధి, జయలలిత మరణిస్తే ఈ పార్టీలు గల్లంతవ్ఞతాయని కొందరు ఊహించారు.కానీ అలా జరగలేదు. స్టాలిన్‌ నాయకత్వంలో డిఎమ్‌కె39లోక్‌సభ స్థానాలకుగాను 23 స్థానాలను గెలుచుకుంది. అలాగే పన్నీర్‌సెల్వం సహకారంతో పళని స్వామి ఏడిఎమ్‌కె ప్రభుత్వానికి గత నాలుగేళ్లుగా సుస్థిరత్వాన్ని అందిస్తూనే ఉంది.

తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు

టిటివి దినకరన్‌ ఒక బలమైన కులానికి నాయకత్వం వహిస్తూ జయలలిత బతికి ఉన్నంత కాలం ఆమెకు కంటిలో నలుసయ్యాడు. ఇప్పుడు అదే దినకరన్‌ డిఎమ్‌కెని బలహీన పరచాలని కంకణం కట్టుకున్నాడు. ఇతడు ఏఎమ్‌ఎమ్‌కె పార్టీని నడిపిస్తున్నాడు.

డా.రామదాస్‌ పిఎమ్‌కె వ్యవస్థాపక అధ్యక్షుడు. వైకో ఎమ్‌డిఎమ్‌కె పార్టీని నడుపుతూ తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న నాయకుడు. ఇతడు డిఎమ్‌కె ఓటుబ్యాంకును దెబ్బతీయగలవాడు.

కరుణానిధి జీవిత కాలంలోనే డిఎమ్‌కెని చీల్చిన ఘనాపాటి అతడు. ఇక కరుణానిధి పాలనా కాలంలోనే తమిళ ప్రజలు వందశాతం అక్షరాస్యులయ్యారు.

కాబట్టి చదువరులైన ఇక్కడి ప్రజలు అనేక భావజాలాలకు, ఆలోచనలకు ప్రభావితులై ఓటువేసే అవకాశం ఉంది. సిపిఐ, సిపిఎం పార్టీలకు కూడా కొన్ని ప్రాంతాల్లో బలం ఉంది. ఈ పార్టీలు ఆర్థికంగా డిఎమ్‌కెపై ఆధారపడినట్టు ఇటీవల బయటపడిన సంగతి.

కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు ఈసారి ఎన్ని కల్లో కీలకపాత్ర పోషించనున్నారు. విదేశీ విద్య, మంచి ఉద్యోగాలు పొందాలనే కోరికతో ఉండే యువకులు తమిళ నాట పాతుకుపోయిన ద్రవిడ భావజాలం పట్ల అంత మక్కువ చూపడంలేదనేది పరిశీలకుల మాట. అందువల్ల ద్రవిడ పార్టీలకు వాళ్లు ఓట్లు వేస్తారని అనుకోలేం

బిజెపి, ఏడిఎంకె స్నేహం

ఒక మామూలు పల్లెటూరి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి పళనిస్వామి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తూ… టీ అమ్ముకుని బతికిన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చెలిమి నెరపడం ఈ ఎన్నికల్లో చాలామందిని ఆకర్షించే అంశం.

జయలలిత బతికి ఉన్న రోజుల్లోనే 1998లో అటల్‌ బిహారి వాజ్‌పాయి మంత్రివర్గంలో చేరడానికి సమ్మతించింది. కాశ్మీరుకి స్వయం ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దుచేయడానికి బిజెపి ప్రభుత్వానికి ఏడిఎమ్‌కె మద్దతు ఇచ్చింది.

ఈ అన్ని అంశాలను గమనించినప్పుడు బిజెపికి చాలాసార్లు అనుకూలంగా మిత్ర పక్షంగా ఈ పార్టీ నిలిచినట్లు అర్థమవ్ఞతుంది. అందుకే బిజెపి ఏడిఎమ్‌కె సహాయంతో తమిళనాట పాగా వేయాలని ఈసారి గట్టిగా ప్రయత్నిస్తున్నది. అలాగే తన మిత్రపక్షం అధికారంలోకి రావడానికి కృషిచేస్తున్నది.

ఆ అంశాలు శాసిస్తున్నాయి

కాలం ఎంత మారినా తమిళనాట కొన్ని అంశాలు అలాగే మిగిలిపోయాయి. తమిళులు హిందీ వ్యతిరేకులు. ఆ వ్యతిరే కత అలాగే ఉంది. వీలుంటే ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం విడిపోవాలనే డిమాండు అలాగే ఉంది.

ప్రధాన రాజకీయ శక్తులు ద్రవిడ సిద్ధాంతం పునాదిగా కలిగినవి కాబట్టి ఆ సిద్ధాంతం ఇంకా కొనసాగుతూనే ఉందక్కడ. ఆర్య భాషగా భావించే సంస్కృత భాషనూ వారు వ్యతిరేకిస్తారు.

బ్రాహ్మణ వ్యతిరేకత, రిజర్వేషన్లలో తిరిగి రిజర్వేషన్లు, కావేరీ జలాల అంశం, శ్రీలంక తమిళుల అంశం… ఇలా అనేక అంశాలు ఇప్పటికీ తమిళ రాజకీయాలను శాసిస్తున్నాయి.

దక్షిణాదిలో బిజెపి ఎత్తుగడలు2024 లోక్‌ సభఎన్నికలు వచ్చేనాటికి బిజెపి దక్షిణాదిలో బలపడాలని ఎత్తుగడలు రచిస్తోంది.

ఇప్పటికే కర్ణాటకలో అది అధికారంలో ఉంది. తెలంగాణలో గణనీయంగా బలపడుతున్నది. కేరళలో శబరిమల అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుని లబ్ధిపొందే విషయంలో తెలివిగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో ఏడిఎమ్‌కె పొత్తు ఈ దిశలో మంచి అవకాశాన్ని ఇస్తున్నది.

రజనీకాంత్‌ నుంచి ఎదురవుతున్న ఛాలెంజ్‌

తమిళనాట రాజకీయాలు సినిమా నటుల కనుసన్నల్లో నడవడం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. ఈయన నుండి డిఎమ్‌కె, ఏడిఎమ్‌కె పార్టీలు పెద్ద సవాల్‌నే ఎదుర్కోవలసి వచ్చేలా ఉంది.

ఇప్పటికే కమల్‌హాసన్‌ రాజ కీయాల్లో ఉన్నారు. రజనీ, కమల్‌లు ఇద్దరూ అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమా నటులు.

అయితే వీరికి ప్రజలు ఓట్ల రూపంలో అధికారాన్ని నజరానాగా ఇస్తారా అంటే లేదనే చెప్పాలి. అయితే ప్రధాన పార్టీల ఓట్లను మాత్రం చీల్చగలిగే శక్తి వీళ్లకు ఉంది.

జిల్లా స్థాయి పార్టీలు కొంప ముంచుతున్నాయి.

తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో జిల్లా స్థాయి పార్టీలు ప్రధాన పార్టీలకు కొరకరాని కొయ్యలుగా ఉన్నాయి. ఇవి 30 నుంచి 40 స్థానాల్లో తమ ప్రభావాన్ని చూపగలవు.

ఉదాహరణకు పిఎమ్‌కె పార్టీనే చూడండి. అది 20 నుంచి 25 ఎమ్‌ఎల్‌ఏ సీట్లను గెలుచుకోగల సత్తా కలిగి ఉంది.

వన్నియార్‌ కులస్థుల అండతో ఈ పార్టీ నెట్టుకువస్తున్నది. అలాగే మత్స్యకారుల హక్కులకోసం పోరాడటమే కాక శ్రీలంక తమిళుల కోసం ప్రత్యేక దేశం ‘ఈలం డిమాండ్‌నూ సమర్థిస్తున్నది.

ఎలా చూసినా 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో డిఎమ్‌కె, ఏడిఎమ్‌కె పార్టీలు గడ్డుపరిస్థితులనే ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పక తప్పదు.

ఈ ఎన్నికలు బాహాబాహీ పోరాటమే. ఎవరు గెలిచినా కొన్ని వందల ఓట్ల తేడా మాత్రమే ఉంటుంది. ఎందుకంటే తమిళ ప్రజలు అక్షరాస్యులు కనుక.

  • ఆర్‌. రాజగోపాలన్‌, న్యూఢిల్లీ

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/