కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా
11 నగరాలపై బాంబుల దాడి

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది ఉక్రెయిన్ కేపిటల్ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల దాడి చేస్తోంది. ఉక్రెయిన్‌ను మూడు వైపుల నుంచి కమ్ముకుంటూ బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్‌ను రష్యా సైన్యం చుట్టుముట్టింది. అంతేకాదు కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని బాంబుల మోత మోగిస్తోంది. కాగా మిలటరీ ఆపరేషన్‌కు దిగిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్ కేపిటల్ కీవ్‌ను రష్యా ఆక్రమించేసింది. బెలారస్, క్రీమియా, లుహాన్స్ నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా బలగాలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి.
తెర – సినిమా వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/