‘మహా’ హంగ్
ఏపార్టీకీ రాని పూర్తి మెజారిటీ
అతి పెద్ద పార్టీగా టిఆర్ఎస్, రెండో పెద్ద పార్టీగా బిజెపి
కాంగ్రెస్కు రెండు డివిజన్లు మాత్రమే
మేయర్ ఎన్నికకు కీలకంగా మారిన ఎంఐఎం

Hyderabad: : ‘గ్రేటర్’ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అంచాలన్నీ తారు మారు అయ్యాయి. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి దుబ్బాక సీనే రిపీట్ అయింది.
టిఆర్ఎస్-బిజెపి నువ్వానేనా అంటూ ఫలితాల్లోదూసుకెళ్లాయి. తొలుత పోస్టల్బ్యాలెట్లో బిజెపీనే ముందం జలో ఉంది. తర్వాత బ్యాలెట్ బాక్కులు ఓపెన్ చేశాక టిఆర్ఎస్ కాస్త పుంజుకుంది. అయినా కూడా అంతగా ప్రభావం చూపించలేదు.
150 కార్పొరేటర్ స్థానాల్లో మేజిక్ ఫిగర్ 76 స్థానాలు.ప్రస్తుతం 55 సీట్లకే టిఆర్ఎస్ పరిమితమైంది. ఇక బిజెపి కూడా అంతే స్థాయిలో దూసుకొచ్చింది.
దాదాపు 48 సీట్లను కమలం కైవసం చేసుకుంది. గ్రేటర్ వాసులు ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో టిఆర్ఎస్కు మేయర్ పీఠం కష్టంగానే మారింది. గ్రేటర్లో 52 ఎక్స్అఫిషియో ఓట్లు ఉన్నాయి.
మొత్తం 202 ఓట్లు, అయితే టిఆర్ఎస్కు ఎక్స్ ఆఫిషియో సభ్యులుఉన్నా మేయర్ పీఠం దక్కాలంటే 64 కార్పోరేటర్లు గెలవాల్సి ఉండింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/