కర్షకుల కష్టాలపై ఇదేమి కరుణ!

రాష్ట్రం: పంజాబ్‌

farmers problems
Farmer-

పంజాబ్‌ రాష్ట్రం, అయిదు నదులు ప్రవహించే ఈ రాష్ట్రంలో బీడు భూములు ఉండవని,అంతా సేద్యయోగ్యమైన భూమితో రాష్ట్రం సస్యసంపదతతో అలరారుతుంటున్నదని ప్రతీతి.

మరో వైపు దేశ రక్షణబాధ్యతను అధిక శాతం పంజాబ్‌ యువత తమ భుజ స్కంధాలపైనే భారం వేసుకుంటున్నారనే అభిప్రాయం ఉంది.

భారతసైన్యంలో ప్రతి కుటుంబం నుంచి కనీసంఒక్కరు పంజాబ్‌రాష్ట్రంలోని సిక్కులు నియమితులు కావడం తమ గర్వకారణంగా వారు చెప్పుకుంటున్నారు. ఇంత ప్రసిద్ధి చెందిన పంజాబ్‌రాష్ట్రం నుంచి రైతులు ముం దుండి దేశ రాజధాని నగరాన్ని దాదాపు దిగ్భందం చేసిన స్థాయిలో ఆందోళన కొనసాగించడం అన్ని రాష్ట్రాల రైతాంగాన్ని ఆలోచనలో పడేసింది.

ఉత్తరాది రాష్ట్రాల రైతులను కలుపుకొని పంజాబ్‌ రైతులుకేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నతీరు అందరి దృష్టిని ఆకర్షించింది. కర్షకుల సంక్షేమానికే కొత్త వ్యవసాయ చట్టం సంస్కరణలంటూ కేంద్రప్రభు త్వం తమ కరుణ రసాన్ని పండిస్తున్నప్పటికీ ఇలాంటి కరుణ తమకు అక్కరలేదని రైతాంగం ఢిల్లీసరిహద్దుల వేదికగా రణనినాదాలు చేస్తున్నది

. రైతుల ఆవేదన, ఆందోళనల దృష్ట్యా కేంద్రమంత్రులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే కొత్త చట్టంలో కార్పొరేట్‌ రంగాలకు ప్రోత్సాహం లభించే అంశాలు అధికంగా ఉన్నాయని, రైతుకు ఉపకరించే విషయాలకు తగిన ప్రాధాన్యత లభించలేదనేది ఆందోళనకారుల ప్రధాన ఆరోపణ. పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరకు భరోసా కల్పించే నిబంధనల కోసం కర్షకలోకం పట్టుబడుతున్నది.

ఇదే అంశంపై రైతులు పెద్దఎత్తున నిరసన కొనసాగిస్తున్నారు. అన్నదాతలు లేవనెత్తిన గిట్టుబాటు ధర విషయమై కేంద్రం జరిపిన చర్చలు వారం రోజుల వారి ఉద్యమం తర్వాతకూడా కొలిక్కిరాలేదు. అయితే రైతుల డిమాండ్ల పరిశీలనకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని చర్చల సందర్భంగా కేంద్రమంత్రులు ఇచ్చిన హామీకి రైతులు ససేమిరా అనడంతో చర్చల ప్రక్రియకు అర్థం లేకుండాపోయింది.

వ్యవసాయచట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్‌తో రైతాంగం రోడ్డునెక్కింది. నవంబర్‌నెలలో కూడా కేంద్రం కమిటీ నియామకంపై ప్రకటన చేసిన ప్పటికీ తిరిగి ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

మరో సారి కూడా కమిటీ ప్రస్తావన రావడంతోసహజంగానే రైతు సంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. గిట్టుబాటు ధర లభించడం రైతులకు కష్టంగా మారిన పరిస్థితులలో మద్దతు ధరను ముందుగానే ప్రకటించ డం సమంజసమనేది కీలక డిమాండ్‌. ఈ మేరకు చట్టసవరణ అనివార్యమని అందుకే ప్రత్యేక పార్ల మెంట్‌ సమావేశలు నిర్వ హించి నూతన వ్యవ సాయ చట్టానికి కేంద్రం సవరణలు తీసుకురావా ల్సిందేనని కర్షకులు కోరుతున్నారు.

రైతాంగం ప్రయోజనాల కోసమే కొత్త వ్యవసాయ చట్టాల ని, పంటల విక్రయాల్లో కర్షకులకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్ర మంత్రులు పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ రైతులు దానిని విశ్వసించడం లేదు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులకు ఎక్కువ మద్దతు ధర ప్రకటిస్తామని కూడా మోడీ వివరించారు.

ప్రత్యేక కిసాన్‌ రైళ్లు,మౌలిక సదుపాయాలు కల్పించి రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేలా అన్ని వసతులు కల్పిస్తామని స్వయంగా ప్రధాని హామీలు గుప్పిస్తున్నా రైతులకు అవి సంతృప్తిని ఇవ్వడంలేదు. దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ లభిస్తుందని, దీంతో పంటలకు మంచి డిమాండ్‌ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కొత్తచట్టాల లక్ష్యాన్ని వివరించే ప్రయత్నం చేసింది.

అక్రమ దళారుల నుంచి రైతులను రక్షిం చేందుకే ఈ సంస్కరణలని, వ్యవసాయచట్టాలపై ప్రతిపక్షాల వదం తులను రైతులు నమ్మవద్దని మోడీ నమ్మకంగా చెబుతున్నా, రైతులు నమ్మడం లేదు. రైతులను మభ్య పెట్టే ఉద్దేశ్యం బిజెపి ప్రభుత్వానికి లేదని వ్యవసాయ చట్టాలతో రైతుకు మరిన్ని కొత్తఅవకాశాలు రావడంతో పాటు న్యాయపరమైన భద్రత కూడా లభిస్తుందనేది కేంద్ర ప్రభుత్వ వాదనగా ఉంది.

అయితే రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు కెనడా దేశ ప్రధాని జస్టిస్‌ ట్రూడో మద్దతు ప్రకటించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సమస్యగా ట్రూడో ఈ ఆందోళన విషయాన్ని ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది.

పైగా ప్రజాస్వామ్యదేశంలోని అంతర్గత వ్యవహారంలో ఇతర ఏ దేశం జోక్యం అవసరంలేదని భారత్‌ నేరుగా కెనడాకు బదులిచ్చింది.పంజాబ్‌లోని సిక్కు రైతులు ముందుడి సాగిస్తున్న ఈ ఆందోళన కావడంతో గురునానక్‌ జయంతి ఉత్సవం సంద ర్భంగా కెనడా ప్రధాని ట్రూడో ఈ మేరకు స్పందించారు.

మనదేశంలోని ఇతర రాజకీయ పార్టీలు కూడా కెనడా ప్రధాన వాఖ్యలను తప్పుపట్టా యి. రైతుల ఆందోళనతో తమ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ సంబంధం లేదని పంజాబ్‌ ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు.

అయితే అఖిల భారత కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వరుస ట్వీట్లతో రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మూడు వ్వయసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలనే డిమాడ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో లక్ష సంఖ్యలో రైతులు ఆందోళన సాగిస్తుండటం రైతాంగం పోరాట చరిత్రలో ఒకమైలురాయిగా మిగిలిపోతుంది.

కర్షకుల శ్రేయస్సు, అభివృద్ధి అంటూ చేసిన చట్టాలు అంతర్జాతీయ, కార్పొరేట్‌ రంగాలకే ఉపయోగపడతా యనే ఆందోళనతోపాటు చట్టంలో మద్దతు ధరకు మంగళం పాడటమే వీరి కోపకారణమైంది. పైగా సాగు చట్టాలు మూడింటి వల్ల స్థానిక మార్కెట్ల పాత్ర గణనీయంగా తగ్గిపోతున్నది. అన్నదాతల ఆగ్రహం ఎటుదారి తీస్తుందో వేచి చూడాల్సి ఉంది.

  • కోనేటి రంగయ్య

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/