నేడు మహిళా కమిషన్ ఎదుట హాజరుకానున్న బండి సంజయ్

ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

bandi-sanjay

హైదరాబాద్ః ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపట్లో మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు. కవిత ఈడీ విచారణపై ఇటీవల స్పందించిన ఆయన.. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కేసును సుమోటోగా తీసుకున్న కమిషన్ ఈ నెల 13న తమ ముందు హాజరు కావాలంటూ సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే.. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో నేడు కమిషన్ ముందుకు వెళ్లనున్న సంజయ్ ఏం వివరణ ఇస్తారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే బండి సంజయ్ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పార్టీ శ్రేణులు పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇక సంజయ్ ఈ ఉదయం 11.00 గంటలకు మహిళ కమిషన్ ముందు హాజరవుతారని తెలుస్తోంది.