ఈరోజు ఇందిరాపార్కు వద్ద బీజేపీ నేతల దీక్ష

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద ఈరోజు బీజేపీ నేతలు దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని వెంటనే ప్రారంభించాలంటూ..’వడ్లు కొను- లేదా గద్దె దిగు’ నినాదంతో బీజేపీ దీక్ష చేపట్టనుంది. ఉదయం 10 గంటలకు మొదలయ్యే రైతు దీక్షలో కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర బీజేపీ ప్రముఖ నేతలు దీక్షలో పాల్గొననున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకే.. ధాన్యం కొనే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడంతో… రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గు‌జ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. రైతులు నష్టపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/