సాయిరెడ్డికి స‌రైన లెక్క‌లు రాసే లింక్ తెగిపోయింది : అయ్యన్న

జ‌గ‌న్‌తో క‌లిసి ఉంటే ఒక‌రికొక‌రు మందులిచ్చుకోవ‌చ్చ‌న్న అయ్య‌న్న‌

Ayyannapatrudu

అమరావతి : టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు గురువారం మ‌రో ట్వీట్ వ‌దిలారు. వైస్సార్సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై సెటైర్లు సంధిస్తూ వ‌దిలిన ఈ ట్వీట్‌లో అయ్యన్న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. స‌రైన లెక్క‌లు రాసే లింక్ విజ‌య‌సాయిరెడ్డికి తెగిపోయింద‌ని ఈ ట్వీట్‌లో అయ్య‌న్న వ్యంగ్యాస్త్రం సంధించారు.

రోజూ నీతులు చెప్పే విజ‌య‌సాయిరెడ్డికి మెదడుకి, చేతికి ఉండాల్సిన “సరైన లెక్కలు” రాసే లింక్ తెగిపోయిందన్న అయ్య‌న్న‌.. తప్పుడు లెక్కలు రాసి ఆయ‌న‌ ఇలా తయారయ్యాడంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సాయిరెడ్డికి ఎక్కడా చూపించనక్కర్లేదని కూడా చెప్పారు. జగన్ రెడ్డితో ఉంటే ఒకరికి ఒకరు మందులు టైం కి ఇచ్చుకోవచ్చంటూ అయ్య‌న్న‌ వ్యంగ్యం ప్ర‌ద‌ర్శించారు.