ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఓ రోజు సస్పెన్షన్ చేసారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఐదో రోజు సమావేశాలు మొదలు కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వెంటనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ నేతలు పట్టుబట్టారు.

స్పీకర్ పోడియంను చుట్టుముట్టి టీడీపీ ఆందోళనకు దిగింది. సీఎం ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారని నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. మొత్తం 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో వరుసగా ఐదో రోజు టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌కు గురయ్యారు. సస్పెండ్‌ అయిన వారిలో డోలా వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణా, నిమ్మకాయల, గొట్టిపాటి, ఏలూరి సాంబశివరావు, మంతెన ఉన్నారు.