క్వశ్చన్ పేపర్ల లీకేజ్ అంశం..కెసిఆర్‌తో టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ భేటి

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్‌ః తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ అంశం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేశారంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని కూడా పలువురు విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను జనార్దన్ రెడ్డి కలిశారు. ఈ ఉదయం ప్రగతి భవన్ కు వెళ్లిన ఆయన ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ కీలక సమావేశం సందర్భంగా మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు కూడా అక్కడ ఉన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి ఏం చేయాలనే దానిపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.