ఆ విషయాన్ని జనసేన అధినేతనే అడగాలి : సోము వీర్రాజు

పొత్తుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాం…సోము వీర్రాజు

అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ..పొత్తుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నామని చెప్పారు. జనసేనతో తాము పొత్తులో ఉన్నామని అన్నారు. టీడీపీతో జనసేన కలుస్తుందో, లేదో అనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నే అడగాలని చెప్పారు.

బీజేపీపై అనవసరపు వ్యాఖ్యలు చేసిన కాకినాడ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆటలను సాగనివ్వబోమని అన్నారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తోందని చెప్పారు. అనంతపురం జిల్లా గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థినిపై హత్యాచారం చేసిన నిందితుడు సాదిక్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/