దివిసీమ అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి
టిడిపి నేత వర్ల రామయ్య

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అదేవిధంగా మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. అయితే మృతుల అంత్యక్రియల విషయంలో పలుచోట్ల ఇబ్బందులు తలెత్తుతూన్నాయి. ఈ నేపథ్యంలో ఏపి టిడిపి నేత వర్ల రామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు ట్విట్టర్ ద్వారా ఓ సలహ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు! కరోనా మృతుల అంత్యక్రియలు (ఖననమ్) చేసేటపుడు ప్రభుత్వ యంత్రాంగం సంయమనం పాటించాలి. మృతుల కుటుంబాల ఆచార వ్యవహరాలు గౌరవించాలి. 1977 లో దివిసిమ ఉప్పెన సందర్బంగా చేసిన అంత్యక్రియల అనుభవాలు పరిగణలోకి తీసుకోవాలి. మృతుల బందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడండి సార్ అంటూ రామయ్య ట్వీట్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/