తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బిజెపి నిరసన

తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై బీజేపీ చేపట్టిన 24 గంటల నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేయడం..కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్ చేయడం ఫై బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ..బిజెపి పార్టీ ఆఫీస్ లోనే నిన్నటి నుండి దీక్ష ను కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటె కేసీఆర్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బిజెపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కిషన్ రెడ్డి దీక్ష ఇవాళ ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది.

మరోవైపు కిషన్ రెడ్డి దీక్ష గురించి తెలుసుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కిషన్‌ రెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని అమిత్ షా కిషన్ రెడ్డికి సూచించారు. కేంద్ర పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోపక్క కిషన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోవడంతో.. ఛాతీలో గాయానికి ఎక్స్‌రే తీసుకోవాలని వైద్యులు సూచించారు.