గాడ్ ఫాదర్ నుండి మరో పవర్ ఫుల్ డైలాగ్ వదిలిన మెగా స్టార్

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ రేపు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా చిరంజీవి మరో పవర్ ఫుల్ డైలాగ్ వదిలాడు. ” కింగ్ నైనా, కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ” అంటూ సాగే ఈ డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు డైలాగులకు మంచి స్పందన వచ్చింది. ‘లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సత్యదేవ్, సునీల్, సముద్రఖని, కీలక పాత్రలలో నటించనున్నారు. కొణిదల సురేఖ సమర్పణలో కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.