ఆ పార్టీలు ప్రజస్వామ్యాన్ని అప్రతిష్ట పాల్జేస్తున్నాయి
విషసంస్కృతికి ఇప్పటికైనా ముగింపు పలకాలి

విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన సమయంలో ఆందోళనలు చేసి పర్యటన ముందుకు సాగకుండా అడ్డుకోవడాన్ని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా తప్పబట్టారు. ఈ తరహా సంస్కృతిని మొదలు పెట్టింది టిడిపినే అని విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు, దౌర్జన్యాలు, రాళ్లు, కోడిగుడ్లు విసురుకునే విషసంస్కృతికి ఇప్పటికైనా ముగింపు పలకాలని జీవీఎల్ సూచించారు. ప్రజాస్వామ్యాన్ని వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి అప్రతిష్ఠ పాల్జేస్తున్నాయని దుయ్యబట్టారు. హైకోర్టును కర్నూల్‌కు తరలించే విషయమై త్వరలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసి మాట్లాడుతానని చెప్పారు. రాజధానిగా అమరావతి కొనసాగాలని బిజిపి రాజకీయ తీర్మానం చేసిన విషయాన్ని జీవీఎల్ పునరుద్ఘాటించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/