చిరంజీవి ఇంటి వద్ద ధర్నాకు అమరావతి జెఎసి పిలుపు

Amaravathi JAC calls for dharna at Chiranjeevi’s home

Hyderabad: సినీనటుడు చిరంజీవి ఇంటి ఎదుట ధర్నా చేయడానికి అమరావతి పరరిక్షణ యువజన జెఎసి పిలుపునిచ్చింది.

దీనితో పోలీసులు చిరంజీవి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. చిరంజీవి ఇంటికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టి నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించారు.

చిరంజీవి అభిమానులు ముందుగానే ఆయన ఇంటికి చేరుకున్నారు. జెఎసి నిరసనకారులకు చిరంజీవి అభిమానులు హెచ్చరికలు జారీ చేశారు.

చిరంజీవి ఇంటిని ముట్టడిస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/